‘షుజి’తో కొత్త అధ్యాయం
అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్తున్న నాగచైతన్య ఇప్పుడు సినిమాలే కాదు కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. సినిమాలతో పాటు ఇప్పటికే పలు వ్యాపారాల్లో అక్కినేని కుటుంబం ఉంది.;
అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్తున్న నాగచైతన్య ఇప్పుడు సినిమాలే కాదు కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. సినిమాలతో పాటు ఇప్పటికే పలు వ్యాపారాల్లో అక్కినేని కుటుంబం ఉంది. తాజాగా నాగచైతన్య తన జీవిత భాగస్వామి శోభితతో కలిసి ఫుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు.
‘షుజి’ అనే బ్రాండ్ పేరుతో కొత్త ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించినట్లు చైతన్య, శోభితలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రుచుల్ని ఒక్కచోట అందించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టామని చైతన్య తెలిపాడు. ఈ మేరకు కిచెన్, వంటకాలు, తయారీ ప్రక్రియల ఫోటోలు షేర్ చేయడం విశేషం.
తమ ప్రయాణానికి అందరి ఆశీర్వాదం, ప్రేమ ఎప్పటికీ కొనసాగాలని నాగ చైతన్య కోరాడు. ఇక చైతన్య కొత్త ప్రయాణంపై అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువరిస్తున్నారు. పెళ్లైన కొద్ది నెలల్లోనే భార్యాభర్తలు కలిసి వ్యాపారం ప్రారంభించడం స్ఫూర్తిదాయకమని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గతంలో చైతన్య 'షోయు' పేరుతో ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. ఇప్పుడు ‘షుజి’ భారతీయ ఫుడ్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.