50 ఏళ్ల పాత నిబంధనలు మారాలి!

టాలీవుడ్‌లో కొనసాగుతున్న కార్మికుల సమ్మె నేపథ్యంలో నిర్మాతలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఓ నోట్ రిలీజ్ చేశారు. వారి ప్రకారం, 50 ఏళ్ల క్రితం రూపొందిన యూనియన్ నిబంధనలతో నేటి పరిస్థితుల్లో సినిమాలు తీయడం సాధ్యం కాదని చెబుతున్నారు.;

By :  S D R
Update: 2025-08-19 01:20 GMT

టాలీవుడ్‌లో కొనసాగుతున్న కార్మికుల సమ్మె నేపథ్యంలో నిర్మాతలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఓ నోట్ రిలీజ్ చేశారు. వారి ప్రకారం, 50 ఏళ్ల క్రితం రూపొందిన యూనియన్ నిబంధనలతో నేటి పరిస్థితుల్లో సినిమాలు తీయడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులకు తగిన రాబడులు రాకపోవడంతో వేతనాల పెంపు నిర్మాతలపై మరింత భారమవుతుందని పేర్కొన్నారు.

అయినా, ఈ ఏడాది 10 శాతం, వచ్చే రెండు సంవత్సరాలకు 5 శాతం చొప్పున పెంపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇది ఇతర చిత్ర పరిశ్రమల కంటే ఎక్కువగానే ఉందని వారు తెలిపారు. రోజుకు 2 వేల రూపాయలకుపైగా సంపాదించే కార్మికులకు ఇంక పెంపు అవసరం లేదని భావిస్తున్నారు.

చిన్న నిర్మాతలు మాత్రం ఈ పెంపును అంగీకరించలేకపోతున్నారు. సినిమా నిర్మాణ విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, అలాగే యూనియన్లు వసూలు చేసే అధిక రుసుములు కొత్త టాలెంట్ రాకకు అడ్డంకిగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు.

మరోవైపు హైదరాబాద్ సినీ హబ్‌గా ఎదుగుతున్న ఈ సమయంలో ఇలాంటి నియంత్రణలు ఉంటే ఇతర భాషల నిర్మాతలు రావడానికి వెనుకాడతారని వారు హెచ్చరించారు. సృజనాత్మక పరిశ్రమ అయిన టాలీవుడ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్, కొత్త ప్రతిభకు అవకాశం కల్పించడం అత్యవసరం అని నిర్మాతలు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News