వెంకటేష్ కెరీర్‌లో తొలిసారి 200 కోట్ల గ్రాస్!
వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లు వసూలు చేసింది.;
వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లు వసూలు చేసింది. కుటుంబ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కొనసాగుతోంది.
అమెరికాలోనూ ఈ సినిమా అదిరిపోయే రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకూ ఇప్పటివరకూ అక్కడ 2.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా వెంకటేష్-అనిల్ రావిపూడి-దిల్ రాజు కలయికలో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది.
ఇప్పటివరకూ వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమా 'ఎఫ్2'. ఈ చిత్రం రూ.132 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరాడు వెంకీ. లాంగ్ రన్ లో ఈ చిత్రం రూ.300 కోట్లు కొల్లగొట్టొచ్చనే అంచనాలున్నాయి.