ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో రూ.100 కోట్లు షేర్!
సంక్రాంతి బరిలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా వసూళ్ల పరంగా అగ్రస్థానంలో దూసుకెళ్తుంది ‘సంక్రాంతికి వస్తున్నాం‘. విడుదలైన ఫస్ట్ వీక్ ఎండ్ కే రూ.100 కోట్లు షేర్ ను కొల్లగొట్టింది.;
సంక్రాంతి బరిలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా వసూళ్ల పరంగా అగ్రస్థానంలో దూసుకెళ్తుంది ‘సంక్రాంతికి వస్తున్నాం‘. వెంకటేష్-అనిల్ రావిపూడి హిట్ కాంబోలో వచ్చిన ఈ సినిమా వీరిద్దరి కలయికలోనే అతిపెద్ద విజయంగా నమోదు కాబోతుంది. విడుదలైన ఫస్ట్ వీక్ ఎండ్ కే రూ.100 కోట్లు షేర్ ను కొల్లగొట్టింది. గ్రాస్ వసూళ్ల పరంగా దాదాపు రూ.200 కోట్లు సాధించొచ్చనే అంచనాలున్నాయి.
మరోవైపు ఓవర్సీస్ లోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం‘ దూకుడు జోరుగా ఉంది. అమెరికాలో 2 మిలియన్ డాలర్లను వసూలు చేసిన ఈ చిత్రం యు.కె. లో 2 లక్షల యూరోల వసూళ్లను సాధించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇదే సంక్రాంతి బరిలో దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్‘ తీవ్రంగా నిరాశపరించింది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం‘ సక్సెస్ దిల్ రాజు లో జోష్ నింపిందని చెప్పొచ్చు. మరి.. లాంగ్ నర్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం‘ ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.