‘జైలర్’ విలన్... హీరోగా ప్రయోగాత్మక చిత్రం

వినాయకన్ కు విలన్ స్థాయి నుంచి హీరోగా ప్రమోషన్ వచ్చింది. అతడు హీరో కొత్త చిత్రం ప్రారంభమైంది.;

By :  K R K
Update: 2025-01-20 04:07 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ మూవీలో వర్మ అనే విలన్ పాత్రను తనదైన రీతిలో రక్తికట్టించాడు మలయాళ నటుడు వినాయకన్. ఆ సినిమాతో అతడి పేరు సౌత్ లో మరింతగా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో అతడికి చాలానే ఆఫర్స్ వచ్చిపడ్డాయి. అయితే ఇప్పుడు వినాయకన్ కు విలన్ స్థాయి నుంచి హీరోగా ప్రమోషన్ వచ్చింది. అతడు హీరో కొత్త చిత్రం ప్రారంభమైంది. సినిమాపేరు ‘పెరున్నాళ్’ (పండుగ).

తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైంది. ‘క్రోవేన్‌మారుం స్రాపెన్‌మారుం’ అనే టాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఉత్సుకతను కలిగించింది. టోమ్ ఇమ్మట్టీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వినాయకన్ కు హీరోగా కొత్త ప్రయోగంగా నిలవనుంది. ఈ చిత్రంలో వినాయకన్ తో పాటు షైన్ టామ్ చాకో, విష్ణు గోవింద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వాగమణ్, పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

ఇది టోమ్ ఇమ్మట్టీ దర్శకత్వంలో రూపొందుతున్న మూడవ సినిమా. టోవినో థామస్ హీరోగా నటించిన "ఒరు మెక్సికన్ అపారత", ఆన్‌సన్ పాల్ ప్రధాన పాత్రలో నటించిన "ది గాంబ్లర్" చిత్రాలకు తర్వాత ఈ చిత్రం తెరపైకి రాబోతోంది. ఈ చిత్రాన్ని ఇమ్మట్టీ కంపెనీ, సూర్యభారతి క్రియేషన్స్, జాలివుడ్ మూవీస్ సంస్థలపై టోమ్ ఇమ్మట్టీ, మనోజ్ కుమార్ కేపీ, జాలీ లోనప్పన్ నిర్మిస్తున్నారు. "పెరున్నాళ్" సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వినాయక్ కొత్త అవతారంలో ఎలా కనిపించబోతారో చూడటానికి సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News