విజయ్ 69.. ‘భగవంత్ కేసరి’ రీమేక్‌ పై కొత్త చర్చలు!

తమిళ స్టార్ హీరో విజయ్ 69వ సినిమాపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.;

Producer :  T70mm Team
Update: 2025-01-12 08:06 GMT

నిన్న హైదరాబాద్‌లో జరిగిన 'సంక్రాంతికి వస్తున్నాం' మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో కమెడియన్ విటీవీ గణేష్ విజయ్ తదుపరి చిత్రానికి సంబంధించిన అనుమానాలకు కొత్త కోణం తీసుకువచ్చాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాను దళపతి విజయ్ ఐదుసార్లు చూశారని, ఈ చిత్రాన్ని రీమేక్ చేయమని ఆయన అనిల్ రావిపూడిని కోరారని గణేష్ వెల్లడించాడు.

ఈ వ్యాఖ్యలతో ఈ ప్రాజెక్టు గురించి కొత్తగా చర్చలు మొదలయ్యాయి. విజయ్ 69వ సినిమా 'భగవంత్ కేసరి' రీమేక్ కావచ్చనే ప్రచారం మొదలైనప్పటికీ, ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన లేనందున అభిమానులు కాస్త గందరగోళంలో ఉన్నారు. ఈ టాపిక్‌పై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ, విజయ్‌గారిని కలవడం వాస్తవమేనని అయితే అది వేరే డిస్కషన్ గురించని తెలిపాడు.

మొత్తంగా విజయ్ 69, 'భగవంత్ కేసరి' రీమేక్ గా తెరకెక్కుతోందా? లేదా? అనే దానిపై ఆ చిత్రబృందమే స్పందించాల్సి ఉంది. ఇవే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి, విజయ్ 69వ సినిమా మీద ఉన్న ఉత్కంఠను మరింత పెంచాయి.

Similar News