రేసింగ్‌లో సత్తా చాటిన అల్టిమేట్ స్టార్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కేవలం నటుడిగానే కాకుండా రేసింగ్ లోనూ దుమ్మురేపుతుంటాడు.;
బైక్‌లతో స్టంట్స్ చేయడంలోనూ, కార్ రేసింగ్ లోనూ తన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటాడు. తాజాగా అజిత్ దుబాయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 24H రేసింగ్‌లో పాల్గొని, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు.
ఎంతో అనుభవమునున్న రేసర్ల మధ్య తన టీమ్‌తో కలిసి హోరాహోరీగా పోటీ పడి మూడో స్థానంలో నిలిచాడు. రేసింగ్‌లో విశేషంగా పాల్గొనడమే కాదు, ప్రాక్టీస్ సమయంలో జరిగిన ప్రమాదాన్నీ ఎదుర్కొని నిలదొక్కుకోవడం అజిత్‌కు ప్రత్యేకతగా నిలిచింది.
అజిత్ ఈ విజయాన్ని తన 'అజిత్ కుమార్ రేసింగ్' టీమ్‌తో సాధించాడు. రేస్‌లో ప్రదర్శించిన స్ఫూర్తికి గుర్తింపుగా 'స్పిరిట్ ఆఫ్ రేస్' అవార్డును పొందాడు. అజిత్ సాధించిన ఈ ఘనతకు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరోవైపు అజిత్ ప్రస్తుతం 'విదా ముయార్చి' సినిమాని విడుదలకు ముస్తాబు చేశాడు. మరో చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది.