‘విశ్వంభర‘ మెగా బ్లాస్ట్ గ్లింప్స్

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఒక రోజు ముందుగానే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మెగా మూవీ ‘విశ్వంభర‘ నుంచి చిరు బర్త్ డే స్పెషల్ గా గ్లింప్స్ రిలీజ్ చేశారు.;

By :  S D R
Update: 2025-08-21 13:00 GMT

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఒక రోజు ముందుగానే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మెగా మూవీ ‘విశ్వంభర‘ నుంచి చిరు బర్త్ డే స్పెషల్ గా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ విశ్వంభరలో అసలు ఏం జరిగిందో ఈరోజు అయినా చెబుతావా అంటూ ఓ చిన్న పాప అడగడం.. దానికి సమాధానంగా కథానాయకుడి గొప్పదనాన్ని వివరించడం వంటి విశేషాలతో ఈ గ్లింప్స్ రెడీ అయ్యింది.

‘ఒకడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొనఊపిరితో బ్రతుకున్న ఓ సమూహం తాలూకు నమ్మకం. అలసి పోని ఆశయానికి ఊపిరి పోసే వాడు ఒకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాలు పాటు పిడికిలి బిగించి ముగిస్తాడని గొప్పగా ఎదురు చూసింది.‘ అంటూ ఈ గ్లింప్స్ లో విశ్వంభర కథను వివరించే ప్రయత్నం చేశారు.

ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుందట నిర్మాత సంస్థ యు.వి.క్రియేషన్స్. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని 2026, వేసవి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    

Similar News