హింసకి హద్దులు అవసరం
తెలుగు సినిమా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. ప్రేక్షకుల అభిరుచి మారుతున్న కొద్దీ, దర్శకులు కూడా కొత్త జానర్లు, బోల్డ్ స్టోరీస్ వైపు అడుగులు వేస్తున్నారు.;
తెలుగు సినిమా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. ప్రేక్షకుల అభిరుచి మారుతున్న కొద్దీ, దర్శకులు కూడా కొత్త జానర్లు, బోల్డ్ స్టోరీస్ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా హింసను ప్రధానంగా ఎలివేట్ చేసే యాక్షన్ సినిమాల ధోరణి పెరుగుతుంది.
ఈమధ్య కాలంలో కొన్ని చిత్రాలు రక్తపాతాన్ని ఓ విజువల్ ఫీస్ట్‌లా మార్చాయి. తలలు తెగిపడటం, శరీర భాగాలు నరుక్కోవడం లాంటి హింసాత్మక దృశ్యాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఇవి బాక్సాఫీసు దగ్గర భారీ విజయాలను అందుకుంటున్నాయి.
హిందీ చిత్రం 'కిల్', మలయాళం మూవీ 'మార్కో'.. ఇప్పుడు తెలుగు నుంచి 'హిట్ 3'. ఈ సినిమాల తరహాలోనే బ్లడ్ బాత్ తో మరికొన్ని రాబోతున్నాయి. వాటిలో చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కలయిక ఒకటి. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లోనే బ్లడ్ ఏ రేంజులో ఉంటుందో చెప్పకనే చెప్పారు.
ఇవి ప్రేక్షకులకు కొత్త అనిపించినా, హద్దులు దాటితే మాత్రం వ్యతిరేకత రావడం తథ్యం. హింసా దృశ్యాలు తారాస్థాయికి వెళ్లడం అనేది కేవలం సంచలనాల మీద ఆధారపడితే ప్రేక్షకులు తిరగబడే ప్రమాదముంది. కాబట్టి, దర్శకులు కొత్తదనం కోసం తాపత్రయపడినా, అది కథకు అనుగుణంగానే ఉండాలి. కథకు హింస ఉపయోగపడితే మాత్రమే చూపించాలి. లేకపోతే, అది దెబ్బతీసే ప్రమాదమే ఎక్కువ.