'అఖండ 2' కోసం విజయశాంతి?
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని జోడీలకు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి కాంబినేషన్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ – లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లది.;
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని జోడీలకు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి కాంబినేషన్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ – లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లది. వీరిద్దరి కలయికలో దాదాపు 17 సినిమాలొచ్చాయి. 1993లో వచ్చిన 'నిప్పురవ్వ' తర్వాత మళ్లీ వీరు కలిసి నటించలేదు.
ఈ క్రేజీ జోడీని 'అఖండ 2' కోసం కలపబోతున్నాడట మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. 'అఖండ 2'లోని ఓ కీలక పాత్ర కోసం బోయపాటి శ్రీను.. విజయశాంతిని సంప్రదించారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఈ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం. విజయశాంతి ఆ రోల్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారన్న టాక్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్.
ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య – విజయశాంతి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇది అభిమానులకే కాదు, రెట్రో తెలుగు సినిమాలను ప్రేమించే వారికీ ఒక ఊహించని గిఫ్ట్ లాంటి సంగతి. ఇప్పుడు ‘అఖండ 2’పై ఉన్న హైప్‌కు, ఈ జోడీ రీ యూనియన్ అంచనాలను రెట్టింపు చేస్తోంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా 'అఖండ 2' నుంచి టీజర్ రానుంది. దసరా కానుకగా 'అఖండ 2'ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.