విజయ్-రష్మిక మూడోసారి!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. వీటిలో మొదటగా 'కింగ్డమ్' ఆడియన్స్ ముందుకు రాబోతుంది.;

By :  S D R
Update: 2025-05-03 03:17 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. వీటిలో మొదటగా 'కింగ్డమ్' ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈనెల 30న పాన్ ఇండియా లెవెల్ లో 'కింగ్డమ్' రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ మూవీ తర్వాత విజయ్ కిట్టీలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్థన్', రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో మరో మూవీ ఉన్నాయి.

ఇప్పటికే విజయ్ కి 'టాక్సీవాలా' వంటి హిట్ ఇచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఇప్పుడు మరో భారీ విజయాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆద్యంతం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందే విజయ్-రాహుల్ సంకృత్యాన్ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది.

ఈ సినిమా కథ 1854-78 మధ్యకాలం నేపథ్యంలో ఉండబోతుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఇప్పటికే పలు సెట్స్ ను నిర్మించారు. ఇక ఈ మూవీలో విజయ్ కి జోడీగా రష్మికను ఫైనలైజ్ చేశారట. విజయ్ – రష్మిక కాంబో అంటేనే అభిమానుల్లో ఎంతో హైప్ వచ్చేస్తోంది. 'గీత గోవిందం, డియర్ కామ్రేడ్' మూవీస్ లో కలిసి నటించిన ఈ జోడీ ఇప్పుడు థర్డ్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

అదే విషయాన్ని లేటెస్ట్ గా మైత్రీ మూవీ మేకర్స్ చెప్పకనే చెప్పింది. రష్మిక తమ ప్రొడక్షన్ లో చేయబోతుంది అనే హింట్ ఇచ్చింది. మొత్తంగా.. ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ పర్ఫెక్ట్ కపుల్ అనిపించుకునే విజయ్-రష్మిక ముచ్చటగా మూడోసారి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తారో చూడాలి.



Tags:    

Similar News