'వీరమల్లు' vs 'కింగ్డమ్'
తెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న 'హరిహర వీరమల్లు', 'కింగ్డమ్' ఇప్పుడు ఒకేసారి బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా జూలై 24న విడుదలయ్యే అవకాశముందని తాజా సమాచారం.;
తెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న 'హరిహర వీరమల్లు', 'కింగ్డమ్' ఇప్పుడు ఒకేసారి బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా జూలై 24న విడుదలయ్యే అవకాశముందని తాజా సమాచారం. అదే సమయంలో విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందిన 'కింగ్డమ్' జూలై 25న విడుదల అవుతోందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ రెండు సినిమాలు చాలా కాలంగా షూటింగ్ దశలో ఉన్నాయి. పవన్ ప్రాజెక్ట్ మొదట క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమై, తర్వాత జ్యోతికృష్ణ చేతుల్లోకి వెళ్లింది. 'కింగ్డమ్' కూడా షెడ్యూల్స్ మార్పులతో పలుమార్లు డేట్ మార్చుకుంది. ఇప్పుడు ఓటీటీ సంస్థలు భారీ మొత్తాల్లో రైట్స్ తీసుకున్న నేపథ్యంలో ఈ చిత్రాలను జూలైలో ఖచ్చితంగా రిలీజ్ చేయాలంటూ నిర్మాతలపై ఒత్తిడి పెడుతున్నాయి. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రావాల్సి ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర క్లాష్ తప్పదని పరిశ్రమలో చర్చ సాగుతోంది.