పాటతో జోష్ పెంచిన 'వీరమల్లు'!
పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ ఈ జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది.;
పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ ఈ జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ రహస్యమయమైన రాబిన్‌హుడ్ తరహా యోధుడి పాత్రలో పవన్ కనిపించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ఎవరది ఎవరది’ అంటూ సాగే గీతం విడుదలైంది. ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతంలో రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం బాగుంది. సాయిచరణ్, హైమత్, లోకేశ్వర్, రోహిత్ ఈ పాటను ఆలపించారు.
మరోవైపు 'వీరమల్లు' రన్‌టైమ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ చిత్రం 2 గంటల 42 నిమిషాల నిడివితో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. కొంతమంది చరిత్రను వక్రీకరించారని విమర్శించినా, చిత్రబృందం అన్ని అడ్డంకులను అధిగమిస్తూ విడుదలకు సిద్ధమవుతోంది.
గ్రాండ్యుయర్ విజువల్స్, చార్మినార్ వంటి పురాతన సెట్స్, పక్కా యాక్షన్ సీక్వెన్స్‌లతో 'హరిహర వీరమల్లు' ఆడియన్స్ కు ఓ విజువల్ వండర్ అందించబోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో, దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.