ఈవారం బాక్సాఫీస్ వార్!

ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరగబోతుంది. రెండు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు ఒక తమిళం, హిందీ చిత్రం కూడా తెలుగు ఫ్లేవర్ తోనే థియేటర్లలోకి వస్తున్నాయి.;

By :  S D R
Update: 2025-04-09 00:57 GMT

ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరగబోతుంది. రెండు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు ఒక తమిళం, హిందీ చిత్రం కూడా తెలుగు ఫ్లేవర్ తోనే థియేటర్లలోకి వస్తున్నాయి.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, 'బేబి' వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'జాక్'. ‘బొమ్మరిల్లు‘ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటివరకూ సిద్ధు నటించిన సినిమాల్లో ఎక్కువగా రొమాన్స్ కనిపిస్తుంది. అయితే ఈ మూవీలో సిద్ధు రొమాన్స్ తో పాటు యాక్షన్ లోనూ ఇరగదీశాడు.

ఏప్రిల్ 10న 'జాక్' వస్తుంటే.. ఏప్రిల్ 11న ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' విడుదలకు సిద్ధమవుతుంది. ప్రదీప్ కి జోడీగా దీపిక పిల్లి నటించింది. మాంక్స్ & మంకీస్ బ్యానర్ లో యంగ్ డైరెక్టర్లు నితిన్, భరత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

తెలుగు సినిమాలు కాకపోయినా తెలుగు ఫ్లేవర్ తో రేపు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి 'గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్' చిత్రాలు. గతంలో సంక్రాంతి సీజన్ లో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమాలను ఒకేసారి విడుదల చేసి ఘన విజయాలు సాధించింది మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పుడు ఈ రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేస్తుంది.

తమిళ తల అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ సినిమా రూపొందింది. ఈ సినిమాలో అజిత్ కి జోడీగా త్రిష నటించగా.. ఇతర కీలక పాత్రల్లో సిమ్రాన్, సునీల్, యోగిబాబు వంటి వారు కనిపించబోతున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా తెలుగులోనూ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కాబోతుంది.

బాలీవుడ్‌ సీనియర్ హీరో సన్నీ డియోల్, తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన భారీ మాస్‌ యాక్షన్ మూవీ ‘జాట్’. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రేపు హిందీలో విడుదలవుతుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కాస్త ఆలస్యంగా రానుందట. 'జాట్' సినిమాకి హిందీ సర్కిల్స్ లో మంచి బజ్ ఉంది.

Tags:    

Similar News