జూన్ 1 నుంచి థియేటర్ల బంద్?

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించేలా ఎగ్జిబిటర్లు (థియేటర్ యాజమానులు) ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రెండు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.;

By :  S D R
Update: 2025-05-18 12:33 GMT

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించేలా ఎగ్జిబిటర్లు (థియేటర్ యాజమానులు) ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రెండు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 65 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. పరిశ్రమలో నెలకొన్న తాజా పరిస్థితులు, థియేటర్లలో సినిమాల రిలీజ్ విధానం, అద్దె ప్రాతిపదికన సినిమా ప్రదర్శన వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.

ఈమధ్య ఎక్కువగా సినిమాలు అద్దె ప్రాతిపదికన విడుదలవుతున్నాయి. దీనివల్ల థియేటర్ యాజమానులకు ఆదాయం తగ్గిపోతుందన్న అభిప్రాయాన్ని ఎగ్జిబిటర్లు వ్యక్తం చేశారు. 'ఇలాంటి విధానం వల్ల థియేటర్ వ్యాపారం మనుగడకు ప్రమాదం ఏర్పడుతోంది. ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించము' అని వారు స్పష్టం చేశారు.

ఈ విషయంపై ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయాన్ని త్వరలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా నిర్మాతల కౌన్సిల్ మరియు నిర్మాతల గిల్డ్‌కు అధికారికంగా తెలియజేయనున్నారు. నిర్మాతలు తమకు సహకరించకపోతే జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఎగ్జిబిటర్లు.

Tags:    

Similar News