గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్
మూడున్నర దశాబ్దాల తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కలయికలో రూపొందుతున్న చిత్రం 'థగ్ లైఫ్'. ఈ సినిమాలో కమల్ కి ధీటైన పాత్రలో మరో స్టార్ శింబు కనిపించబోతున్నాడు.;
మూడున్నర దశాబ్దాల తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కలయికలో రూపొందుతున్న చిత్రం 'థగ్ లైఫ్'. ఈ సినిమాలో కమల్ కి ధీటైన పాత్రలో మరో స్టార్ శింబు కనిపించబోతున్నాడు. ఇంకా త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జూన్ 5న 'థగ్ లైఫ్' రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రచారాన్ని వేగవంతం చేసింది టీమ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ‘జింగుచా‘ సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మణిరత్నం ‘నాయకుడు‘ స్టైల్ లోనే గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.
గ్యాంగ్ స్టర్ సామ్రాజ్యంలో కమల్ హాసన్, శింబు మొదట ఒకే గ్రూప్ లో ఉన్నా.. ఆ తర్వాత ఒకరికొకరు తలపడే సన్నివేశాలు ఈ ట్రైలర్ లో హైలైట్ గా ఉన్నాయి. మరోవైపు ఏడుపదుల వయసులోనూ కమల్.. అభిరామితో లిప్ లాక్ సీన్.. మణిరత్నం వింటేజ్ స్టైల్ ను గుర్తు చేస్తుంది. ఇక యాక్షన్ లో కమల్ హాసన్ వీర విహారం చేస్తున్నాడు. మొత్తంగా ట్రైలర్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణిరత్నం మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్, తెలుగులో శ్రేష్ట్ మూవీస్, నార్త్‌లో పెన్ మరుధర్, కర్ణాటకలో ఫైవ్ స్టార్ సెంథిల్ సంస్థలు భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాయి.