సమ్మర్ స్క్రీన్ వార్ 2026!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధానంగా సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండగలు బాక్సాఫీస్ హవాకు ఊతమిచ్చే సీజన్లుగా నిలుస్తాయి. తాజాగా మరో పండగ శ్రీరామ నవమి — సినీ నిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది.;

By :  S D R
Update: 2025-04-07 01:11 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధానంగా సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండగలు బాక్సాఫీస్ హవాకు ఊతమిచ్చే సీజన్లుగా నిలుస్తాయి. తాజాగా మరో పండగ శ్రీరామ నవమి — సినీ నిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' వచ్చే ఏడాది శ్రీరామ నవమి కానుకగా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 'దసరా' వంటి సూపర్ హిట్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రం నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. మార్చి 26, 2026న 'ది ప్యారడైజ్' విడుదల తేదీని ప్రకటించారు. ఎస్.ఎల్.వి. సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఈ అనౌన్స్‌మెంట్ వేడి తగ్గకముందే, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న 'పెద్ది' చిత్రం, మార్చి 27, 2026న విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది శ్రీరామ నవమి కానుకగా వచ్చే శ్రీరామ నవమికి విడుదల తేదీని ఖరారు చేసుకుంది 'పెద్ది'.

అటు శ్రీకాంత్ ఓదెల, ఇటు బుచ్చిబాబు ఇద్దరూ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యులు కావడం విశేషం. అంటే సుకుమార్ శిష్యులు ఇద్దరూ ఒక్క రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నారన్న మాట. అయితే ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రచారం నాని 'ది ప్యారడైజ్' అప్పటివరకూ పూర్తవ్వడం కష్టమే అంటున్నారు.

'పెద్ది, ది ప్యారడైజ్' చిత్రాలకంటే ఒక వారం ముందుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది యష్ 'టాక్సిక్'. యష్ 'టాక్సిక్' సినిమా 2026, మార్చి 19న విడుదల అవుతుందని ప్రకటించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, పాన్ ఇంటర్నేషనల్ రిలీజ్ గా ప్రకటించారు.

మరోవైపు బాలీవుడ్ నుంచి దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'లవ్ అండ్ వార్' మూవీ మార్చి 20వ తేదీకి ఫిక్స్ అయింది. ఇందులో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం టార్గెట్ చేస్తోంది. మొత్తంగా ఈ సినిమాలన్నీ పాన్ ఇండియాను టార్గెట్ చేస్తూ వస్తున్నవే. దీంతో వచ్చే ఏడాది మార్చిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బడా క్లాష్ జరగబోతుంది.

Tags:    

Similar News