సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైన సింధు

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి సింధు తులాని. ‘ఐతే‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సింధు ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా పలు చిత్రాల్లో నటించింది.;

By :  S D R
Update: 2025-05-24 10:19 GMT

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి సింధు తులాని. ‘ఐతే‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సింధు ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ‘మన్మధ, అతనొక్కడే, గౌతమ్ ఎస్.ఎస్.సి., సరదా సరదాగా‘ వంటి సినిమాలు తెలుగు లో సింధుకి కథానాయికగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

కళ్యాణ్ రామ్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘అతనొక్కడే‘లో అంజలి పాత్రలో అదరగొట్టింది సింధు తులాని. ఈ మూవీలో ‘చిట పట‘ వాన పాటలో సింధు వేసిన స్టెప్పులను మరచిపోలేదు. ఆ తర్వాత క్యారెక్టర్ యాక్టర్ గా టర్న్ తీసుకున్న సింధు.. మరెన్నో సినిమాలతో అలరించింది.

ఈకోవలోనే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి‘లో వదిన పాత్రలో నటించింది. ఇక ‘సన్నాఫ్ సత్యమూర్తి‘ తర్వాత పదేళ్లు సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని.. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా‘లో మెరవబోతుంది.

ఈ సినిమాలో రామ్ కి జోడీగా భాగ్యశ్రీ నటిస్తుండగా.. కీలక పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర కనిపించబోతున్నాడు. మరో కీలక పాత్రలో సింధు నటిస్తుంది. మొత్తంగా.. రామ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సింధు.. మునుముందు మరిన్ని మంచి క్యారెక్టర్స్ తో బిజీ అవుతుందేమో చూడాలి.

Tags:    

Similar News