'విశ్వంభర' ఆలస్యానికి కారణం ఇదే!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఈ ఏడాది జనవరిలోనే రావాల్సిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ పనులు కారణంగా వాయిదా పడింది.;
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఈ ఏడాది జనవరిలోనే రావాల్సిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ పనులు కారణంగా వాయిదా పడింది. అలాగే.. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌కు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా విమర్శలు ఎదురయ్యాయి. దీంతో మేకర్స్ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని మరింత క్వాలిటీ అవుట్‌పుట్‌పై దృష్టి సారించారు.
ఇప్పటికే ఈ చిత్రంలోని కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ చూసిన సినిమా వ్యక్తులు అవి హై స్టాండార్డ్ లో ఉన్నాయనే కితాబులు ఇస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీలో 4676 గ్రాఫిక్ షాట్లు ఉంటాయని డైరెక్టర్ వశిష్ట తెలిపాడు. ఈ సినిమాకోసం ప్రపంచస్థాయి వీఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నాయట. 'ప్రతి ఫ్రేమ్‌ను విజువల్ వండర్‌లా తీర్చిదిద్దే పనిలో ఉన్నాం కాబట్టి, కొంత టైమ్ పడుతోంది' అంటూ 'విశ్వంభర' ఆలస్యంపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.
చిరంజీవి సరసన త్రిష నటిస్తుండగా.. కీలక పాత్రల్లో ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, కునాల్ కపూర్ వంటి వారు కనిపించనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీకి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉండగా, ఒక ఐటెం సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఎంపికైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో 'విశ్వంభర' రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.