బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజుల జోరు!

రీ-రిలీజుల సంప్రదాయం అనేది అనాది నుంచి వస్తున్నదే. తెలుగు సినిమా స్వర్ణయుగంలో కొన్ని చిత్రాలు మొదటిగా విడుదలైన సమయం కంటే.. రీ రిలీజులలోనే పెద్ద విజయాలు సాధించిన సందర్భాలున్నాయి.;

By :  S D R
Update: 2025-06-24 10:03 GMT

రీ-రిలీజుల సంప్రదాయం అనేది అనాది నుంచి వస్తున్నదే. తెలుగు సినిమా స్వర్ణయుగంలో కొన్ని చిత్రాలు మొదటిగా విడుదలైన సమయం కంటే.. రీ రిలీజులలోనే పెద్ద విజయాలు సాధించిన సందర్భాలున్నాయి. ‘గుండమ్మ కథ‘ వంటి కొన్ని క్లాసిక్ మూవీస్ అయితే ఎన్నిసార్లు రీ రిలీజ్ అయినా కాసుల వర్షం కురిపించిన సందర్భాలే ఎక్కువే.

మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఈమధ్య కాలంలో తెలుగులో రీ-రిలీజుల ట్రెండ్ పెరిగింది. అగ్ర కథానాయకుల చిత్రాలు మాత్రమే కాదు.. చిన్న చితకా సినిమాలు కూడా ఇప్పుడు వరుసగా రీ-రిలీజ్ కు వస్తుండటం ఒకింత ఆశ్చర్యకరమే.

ప్రస్తుతం థియేటర్లలోకి మళ్లీ రాబోతున్న చిత్రాల సంగతికి వస్తే.. జూన్ 28న రీ-రిలీజ్ కు రెడీ అవుతుంది ‘హనుమాన్ జంక్షన్‘. అర్జున్, జగపతిబాబు, వేణు హీరోలుగా మోహన్ రాజా డైరెక్షన్ లో రూపొందిన చిత్రమిది. 2001లో విడుదలైన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్ వంటి వారు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేయడం విశేషం.

జూలై విషయానికొస్తే ముందుగా జూలై 10న ‘కుమారి 21 F‘ రీ-రిలీజ్ కు రెడీ అవుతుంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం చిన్న సినిమాగా వచ్చి ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం మరో ప్లాస్ పాయింట్. ఇక జూలై 11న మాస్ మహారాజ రవితేజ ‘మిరపకాయ్‘ రీ-రిలీజ్ కు రెడీ అవుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మాస్ రాజా అభిమానులను అప్పట్లో బాగా మెప్పించింది. తమన్ అందించిన పాటలు సూపర్ హిట్.

జూలైలో సూర్య నటించిన ‘గజిని, వీడొక్కడే‘ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో రీ-రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. జూలై 18న ‘గజిని‘ విడుదలవుతుంటే.. జూలై 19న ‘వీడొక్కడే‘ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక అక్కినేని హీరో నాగచైతన్యకి తొలి విజయాన్ని అందించిన ‘ఏ మాయ చేసావె‘ జూలై 18న రీ-రిలీజ్ కు రెడీ అవుతుంది. గౌతమ్ వాసు దేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచింది.

Tags:    

Similar News