సక్సెస్ మీట్ లో పవర్‌ఫుల్ స్పీచ్
పవర్ స్టార్, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' ఈరోజు గ్రాండ్ గా రిలీజైంది.;
పవర్ స్టార్, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' ఈరోజు గ్రాండ్ గా రిలీజైంది. ఎన్నో విఘ్నాలను దాటి వచ్చిన ఈ పీరియాడిక్ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'ఇది నా జీవితంలో మొదటి సక్సెస్ మీట్. సినిమాల ప్రమోషన్స్ చేయడం నాకు అలవాటు లేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా నేను పంచాయతీలు కూడా చేయాల్సి వచ్చింది. డిప్యూటీ సీఎం అయినా నా సినిమా సులువుగా రిలీజ్ చేయలేకపోయాను. గత వారం రోజులుగా సరిగా నిద్రపోలేదు' అని పేర్కొన్నారు.
బాయ్‌కాట్ ట్రెండ్‌పై స్పందిస్తూ 'నా సినిమాను ఎందుకు బాయ్‌కాట్ చేయాలని భావిస్తున్నారు? నా సినిమా మిమ్మల్ని అంతగా బెదిరించిందా? ఎవడో ఓ హీరో సినిమా తీస్తే భయపడుతున్నారంటే, నేను ఎంత ఎదిగానో మీరే చెబుతున్నారు. ఇదేమైనా క్విట్ ఇండియా మూవ్‌మెంటా? ఏం చేస్తారో చేసుకోండి, నాకు ఏ ఫరక్ పడదు. నేను ధైర్యంగా ఉండటమే నేర్చుకున్నా. డిప్రెషన్ అనేది మనమే క్రియేట్ చేసుకుంటాం. జీవితం బతకడమే అద్భుతం' అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
అలాగే 'నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. చిన్న విజయం అయినా నేర్చుకోవడమైనా నేనెప్పుడూ కష్టపడే సాధించాను. భగవంతుడే నన్ను ఈ సినిమాను నేనే ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తెచ్చాడు. సినిమాల సక్సెస్‌లు తలకెక్కించుకోను. మైత్రీ మూవీ మేకర్స్, టీజీ విశ్వప్రసాద్ లేకపోతే వీరమల్లు విడుదల అయ్యేది కాదు' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.