‘ఉస్తాద్..‘ సెట్స్ నుంచి ఫోటో!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనా పరమైన బాధ్యతలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మళ్లీ షూటింగ్ మోడ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనా పరమైన బాధ్యతలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మళ్లీ షూటింగ్ మోడ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఆగిపోయిన తన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు. ఈకోవలో ఇప్పటికే ‘హరిహర వీరమల్లు, ఓజీ‘ చిత్రాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మరో లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ను తిరిగి పట్టాలెక్కించాడు.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్‘ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అప్పటికే కొన్నేళ్లుగా విజయాలకు దూరమైన పవన్ ను మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చిన చిత్రంగా ‘గబ్బర్ సింగ్‘ నిలిచింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ కూడా అదే తరహాలో పోలీస్ స్టోరీగా రాబోతుంది.
ఈ సినిమాలోనూ పోలీసాఫీసర్ గా తన మార్క్ పవర్, కామెడీతో అలరిస్తాడట పవన్. ఈ చిత్రంలో పవన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇటీవల (జూన్ 14) శ్రీలీల బర్త్ డే స్పెషల్ గా ‘ఉస్తాద్.. ‘ సెట్స్ లో ఆమెతో కేట్ కట్ చేయించారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పవర్ స్టార్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పవర్ స్టార్ పోలీస్ డ్రెస్ లో ‘గబ్బర్ సింగ్‘ నాటి లుక్ తో మెస్మరైజ్ చేస్తుండటం విశేషం.