‘వీరమల్లు‘ ట్రైలర్ వీక్షించిన పవన్, త్రివిక్రమ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు'. పవన్ నటించిన తొలి చారిత్రక కథాంశ చిత్రమిది. ఈ సినిమాలో ఓ యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు పవర్ స్టార్.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు'. పవన్ నటించిన తొలి చారిత్రక కథాంశ చిత్రమిది. ఈ సినిమాలో ఓ యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు పవర్ స్టార్. 400 ఏళ్ల క్రితం నాటి కథతో జ్యోతికృష్ణ, క్రిష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎ.ఎమ్.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు.
‘హరిహర వీరమల్లు‘ ట్రైలర్ ను రేపు గ్రాండ్ లెవెల్ లో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో ఈ ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా త్రివిక్రమ్ తో సహా చిత్రబృందంతో ఈ ట్రైలర్ ను వీక్షించారు. అందుకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది టీమ్. ఇక ట్రైలర్ చూసి పవన్ ఎంతో ఎగ్జైట్ అయినట్టు తెలుస్తోంది. జూలై 24న ‘హరిహర వీరమల్లు‘ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.