నటుడిగా నాగార్జున కొత్త ప్రయాణం!

కింగ్ నాగార్జున నటుడిగా కొత్త టర్న్ తీసుకున్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసినా అవి ఎక్కువగా పరభాషా చిత్రాలు కావడం విశేషం. ఫుల్ లెన్త్ హీరోగా కాకుండా ఒక క్యారెక్టర్ లో కనిపించడం ఇప్పుడు ‘కుబేరా‘తో అని చెప్పాలి.;

By :  S D R
Update: 2025-06-21 09:43 GMT

కింగ్ నాగార్జున నటుడిగా కొత్త టర్న్ తీసుకున్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసినా అవి ఎక్కువగా పరభాషా చిత్రాలు కావడం విశేషం. ఫుల్ లెన్త్ హీరోగా కాకుండా ఒక క్యారెక్టర్ లో కనిపించడం ఇప్పుడు ‘కుబేరా‘తో అని చెప్పాలి. ఈ సినిమాతో ఇకపై కథానాయకుడిగా మాత్రమే కాకుండా, కీలక పాత్రలతో కూడా తాను మెప్పించగలడని నిరూపించాడు నాగ్.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగార్జున దీపక్ అనే సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించగా, ఇది కేవలం గెస్ట్ రోల్ అనుకున్న ప్రేక్షకులకు థియేటర్‌కి వెళ్లిన తర్వాత ఓ చిన్న షాక్ తగిలింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ సినిమాకు కీలకంగా నిలిచి, పూర్తి స్థాయిలో స్క్రీన్‌ను డామినేట్ చేసింది. ప్రమోషన్స్ లో చెప్పినట్లుగానే, నాగ్ తప్ప ఈ పాత్రను ఇంకెవ్వరూ చేయలేరు అనిపించేలా ఆయన నటన ఆకట్టుకుంది.

డీ గ్లామర్ లుక్, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్ తో కొత్త నాగార్జునను చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ధనుష్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడమే కాకుండా, సినిమాను పూర్తిగా తన భుజాలపై మోస్తూ, తన పాత్రకు కావాల్సిన గౌరవాన్ని తీసుకొచ్చాడు.

ఈ విజయం కేవలం నటన ప‌రంగా కాదు. సినిమా ప్రమోషన్‌లోనూ నాగార్జున పూర్తి స్థాయిలో పాల్గొనడం, ‘కుబేర’ సక్సెస్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. ‘కుబేర‘ తర్వాత ‘కూలీ‘ చిత్రంలోనూ కొత్త నాగార్జునను చూడబోతున్నాము. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కూలీ‘లో నాగ్ స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నాడు.

అయితే ఇదే ఊపులో నాగ్ సోలో హీరోగా చేసే సినిమాలు తగ్గుతాయేమో అనే టెన్షన్ అభిమానుల్లో కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం యాక్టర్ గా నాగార్జున చేస్తున్న ప్రయోగాలు, ఆయన కెరీర్‌ను మరో దశకు తీసుకెళ్తాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు నాగార్జున తన ప్రెస్టేజియస్ వందో సినిమాకోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags:    

Similar News