‘కూలీ’లో విలన్‌గా నాగార్జున!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.;

By :  S D R
Update: 2025-06-18 00:36 GMT

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రజనీతో పాటు పలువురు స్టార్ హీరోలు కనిపించబోతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

తాజాగా ‘కుబేర’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాగార్జున, ‘కూలీ’లో తాను విలన్ పాత్ర పోషిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించాడు. కథను చెప్పేముందే దర్శకుడు లోకేశ్ కనగరాజ్ 'విలన్ పాత్ర చేస్తారా?" అని అడిగారని, కథ మొదటి భాగం విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పాడు. 'మనుషులు ఇంత దారుణంగా ఉంటారా?' అని తాను అడిగితే.. 'అవును.. మనుషులు రాక్షసులే' అని లోకేశ్ సమాధానం ఇచ్చాడని నాగ్ వెల్లడించాడు.

‘కూలీ’లో నాగార్జున క్యారెక్టర్ పూర్తిగా నెగెటివ్ షేడ్‌తో ఉంటుందని, చాలా క్రూరంగా ఉండే వ్యక్తిగా కనిపించనున్నట్లు తెలిపారు. అందరితో రఫ్‌గా ఉండాల్సి వచ్చిందని, కొన్ని సీన్లలో అమ్మాయిలను తిట్టాల్సి వచ్చిందని కూడా వెల్లడించాడు. ‘కూలీ’ వంటి ఇంటెన్స్ క్యారెక్టర్ నుంచి ‘కుబేర’ వంటి సాఫ్ట్ క్యారెక్టర్‌కి మారడం తానొక డిఫరెంట్ అనుభవంగా ఫీల్ అయ్యానన్నాడు నాగ్.

'కూలీ'లో నాగార్జునతో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ ను ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Tags:    

Similar News