'వీరమల్లు'పై హైప్ పెంచేస్తోన్న నాగవంశీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు' జూలై 24న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీ ట్రైలర్ ను జూలై 3న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు' జూలై 24న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీ ట్రైలర్ ను జూలై 3న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్స్‌లో ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ను వీక్షించిన సితార అధినేత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా తన ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నారు.
'జులై 3న పవన్ కళ్యాణ్ గారు ఫైర్‌లా కనిపించనున్నారు. ఇది ఓ మాస్ సర్‌ప్రైజ్ అవుతుంది' అని తన ట్వీట్ లో తెలిపారు నాగవంశీ. 'హరిహర వీరమల్లు ట్రైలర్ పెద్ద స్కేల్ లో అత్యున్నత స్థాయిలో ఉందని.. ఫ్యాన్స్ కు ఈ ట్రైలర్ ఓ విజువల్ ట్రీట్ అనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు నాగవంశీ.
మరోవైపు విజయ్ దేవరకొండతో తాము నిర్మిస్తున్న 'కింగ్డమ్' గురించి ఓ ట్వీట్ చేశారు నాగవంశీ. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'కింగ్డమ్' సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై నాగవంశీ స్పందించారు. ఈ సినిమా గురించి నెగటివ్ కామెంట్లు వస్తున్నా, ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని అందించే చిత్రమిదని చెప్పారు. త్వరలో ఈ సినిమా ట్రైలర్, రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.