మెగా 157 టైటిల్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'మెగా 157'. 2026 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది.;
మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'మెగా 157'. 2026 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఇంకా షూటింగ్ స్టేజ్‌లో ఉండగానే ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట.
ఈ సినిమాలో చిరంజీవి 'శివశంకర వరప్రసాద్' అనే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి అసలు పేరు కూడా కొణిదెల శివశంకర వరప్రసాద్. ఇప్పుడు ఆ పేరునే టైటిల్‌గా పరిశీలిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'మన శివశంకర వరప్రసాద్' అనే టైటిల్‌ను ఈ సినిమాకి ఫైనల్ చేయనున్నట్లు టాక్.
అయితే, తొలుత 'రఫ్ఫాడించేద్దాం' అనే మాస్ టైటిల్‌ను అనుకున్నట్టు వినిపించినా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన నెగటివ్ ఫీడ్‌బ్యాక్ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి టైటిల్‌పై మళ్లీ ఆలోచనలో పడ్డాడట. ప్రస్తుతం 'మన శివశంకర వరప్రసాద్' అనే టైటిల్ ను సోషల్ మీడియాలో టెస్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడట. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో మురిపించనున్నాడు. చిరు బర్త్‌డే స్పెషల్ గా ఆగస్టు 22న 'మెగా 157' టైటిల్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది.