‘మెగా 157‘ మొదలైంది!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీ ‘మెగా 157‘ అనుకున్న ప్రకారమే అప్పుడే షూటింగ్ మొదలు పెట్టుకుంది. హైదరాబాద్ లోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షురూ అయ్యింది.;

By :  S D R
Update: 2025-05-23 11:50 GMT

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీ ‘మెగా 157‘ అనుకున్న ప్రకారమే అప్పుడే షూటింగ్ మొదలు పెట్టుకుంది. హైదరాబాద్ లోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షురూ అయ్యింది. ఆ తర్వాత రెండో షెడ్యూల్ కోసం కేరళ వెళ్లనున్నారట. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు నయనతార కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక అనిల్ గత చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం‘కి భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆ చిత్రం మ్యూజికల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు చిరు కోసం అంతకు మించి అన్నట్టుగా అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేశాడట భీమ్స్. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ‘మెగా 157‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags:    

Similar News