వారసత్వం గురించి మనోజ్ వ్యాఖ్యలు
సినీ నేపథ్యం ఉన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కష్టపడాల్సిందేనని నటుడు మంచు మనోజ్ అన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ‘ఓ భామ అయ్యో రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.;
సినీ నేపథ్యం ఉన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కష్టపడాల్సిందేనని నటుడు మంచు మనోజ్ అన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ‘ఓ భామ అయ్యో రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
యూట్యూబ్‌తో కెరీర్ ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగిన సుహాస్ గురించి మాట్లాడుతూ, 'ఆయన పట్టుదల యువతకు ఆదర్శం. నిజం చెప్పాలంటే, ఆయన నాకూ స్ఫూర్తి,' అని ప్రశంసించాడు. సినీ కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన విజయం వరించదని, నిరంతరంగా కష్టపడితేనే ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందన్నాడు.
సినిమా విజయం స్టార్ హీరోలపై కాకుండా కంటెంట్‌పైనే ఆధారపడి ఉంటుందన్న మంచు మనోజ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి లాగే సుహాస్ కూడా ఒకవైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు.
జూలై 11న విడుదలకానున్న ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాపై సుహాస్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. అనుష్క మూవీ వాయిదాతో, ఈ చిన్న సినిమాకు మంచి విండో లభించినట్లు ట్రేడ్ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.