మహేష్ డబుల్ ధమాకా!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన రెండు క్లాసిక్ సినిమాలు.. 'ఒక్కడు' (2003), 'భరత్ అనే నేను' (2018). ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఒకేరోజు రీ-రిలీజ్ కు రెడీ అయ్యాయి.;
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన రెండు క్లాసిక్ సినిమాలు.. 'ఒక్కడు' (2003), 'భరత్ అనే నేను' (2018). ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఒకేరోజు రీ-రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ చిత్రాలు ఏప్రిల్ 26న తిరిగి థియేటర్లలోకి వస్తుండడంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
'ఒక్కడు' సినిమా మహేష్ బాబును నిజమైన స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం. గుణశేఖర్ దర్శకత్వంలో, ఎమ్.ఎస్. రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రత్యేకంగా మహేష్ బాబు స్వాగ్, ఛార్మినార్ సెట్, మణిశర్మ అందించిన సంగీతం, భూమిక, ప్రకాశ్ రాజ్ నటన 'ఒక్కడు'ని మెమరబుల్ మూవీగా నిలిపాయి. ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 26న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోని సంధ్య, విశ్వనాథ్ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడం విశేషం.
అదే రోజు మహేష్ మరో చిత్రం 'భరత్ అనే నేను' కూడా రీ రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో, డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో మహేష్ బాబు ఒక యువ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి తన నటనలో కొత్త కోణాన్ని ప్రదర్శించాడు. రాజకీయ, సామాజిక అంశాలకు వినూత్న రూపం ఇచ్చిన ఈ చిత్రం 2018లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా మెప్పించారు. ఈ సినిమా రీ రిలీజ్ బుకింగ్స్ ఏప్రిల్ 19న ఉదయం 11:11కి ప్రారంభమవుతున్నాయి.