వైరల్ గా మారిన క్లీంకార వీడియో
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 10న జరిగిన ఈ వేడుకకు చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన హాజరై మెగా ఫ్యామిలీ అంతా ఈ ఘట్టాన్ని మరింత విశేషంగా మార్చింది.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 10న జరిగిన ఈ వేడుకకు చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన హాజరై మెగా ఫ్యామిలీ అంతా ఈ ఘట్టాన్ని మరింత విశేషంగా మార్చింది.
మ్యూజియం నిర్వాహకులు కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కి వచ్చి చరణ్ కొలతలు తీసుకుని, అతడి మైనపు విగ్రహాన్ని రూపొందించారు. ప్రత్యేకత ఏమిటంటే, చరణ్ విగ్రహంతో పాటు అతని పెంపుడు కుక్క రైమ్ విగ్రహాన్ని కూడా అందులో భాగంగా ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ప్రభాస్ (సింగపూర్), అల్లు అర్జున్ (దుబాయి) మైనపు విగ్రహాలు స్థానం దక్కించుకున్నప్పటికీ, చరణ్‌కి లండన్‌లో ఈ గౌరవం దక్కడం విశేషం. ఈ సందర్భంగా లండన్ తెలుగు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రైమ్ పేరిట ప్లకార్డులు పట్టుకుని అభిమానులు సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆసక్తికర విషయమేమిటంటే.. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రామ్ చరణ్ తన పెట్ డాగ్ రైమ్ తో కలిసి ఫోటోలకు పోజులిస్తుండగా, క్లీంకార హఠాత్తుగా అక్కడికి వచ్చి రియల్ డాడీని పక్కన పెట్టి, మైనపు విగ్రహం దగ్గరకు వెళ్లింది. ఈ ఆసక్తికర ఘనటకు సంబంధించిన వీడియో నెట్టంట జోరుగా చక్కర్లు కొడుతుంది.