'కింగ్డమ్' ఎమోషనల్ సాంగ్ ప్రోమో!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ సినిమాతో హార్ట్‌ఫుల్ హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-07-16 00:53 GMT

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ సినిమాతో హార్ట్‌ఫుల్ హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్‌ను మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో చూడబోతున్నట్టు ప్రచార చిత్రాలతో అర్థమవుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న గ్రాండ్‌గా విడుదలకానుంది.

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్ అవ్వగా.. లేటెస్ట్ గా సెకండ్ సింగిల్ వస్తోంది. 'అన్నా అంటూనే' అనే సెంటిమెంటల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. బ్రదర్ ఎమోషన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించి స్వయంగా పాడాడు కూడా. విజయ్, సత్యదేవ్ మధ్య సాగే ఎమోషనల్ మామెంట్స్ ఈ సాంగ్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి. లేటెస్ట్ గా ఈ సాంగ్ ప్రోమో రిలీజై ఇన్‌స్టెంట్‌గా హిట్ అయ్యింది.

మరోవైపు ‘కింగ్డమ్’ హిందీ థియేట్రికల్ రిలీజ్ అంశంపై ఓ క్లారిటీ వచ్చింది. తొలుత హిందీ అనౌన్స్‌మెంట్ లేకపోవడంతో అందరిలో సందిగ్ధత నెలకొన్నా.. తాజాగా నిర్మాత నాగవంశీ హిందీ వెర్షన్‌ను వేరే టైటిల్‌తో త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలిపారు.


Full Viewa


Tags:    

Similar News