తెలుగు చిత్ర పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు
తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFEF) ఇచ్చిన 30% వేతనాల పెంపు డిమాండ్‌తో ఆగస్ట్ 4 నుండి షూటింగ్‌లు నిలిపివేశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.;
తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFEF) ఇచ్చిన 30% వేతనాల పెంపు డిమాండ్‌తో ఆగస్ట్ 4 నుండి షూటింగ్‌లు నిలిపివేశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫెడరేషన్ నిర్ణయాన్ని ఖండిస్తూ, నిర్మాతల సంఘం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ సంక్షోభానికి స్పందనగా, నిర్మాతలు యూనియన్ల సభ్యులకే మాత్రమే పని ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నైపుణ్యం ఉన్న ఔత్సాహికులు, అనుభవజ్ఞులు ఎవరైనా యూనియన్ సభ్యత్వం లేకుండానే చిత్రాల్లో పనిచేయవచ్చని TFCC ప్రకటనలో వెల్లడించింది.
దీంతో, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనేక విభాగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతూ కొత్త ప్రకటనను విడుదల చేసింది. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, లైటింగ్, ఆర్ట్, సౌండ్, ఎడిటింగ్, మేకప్, కాస్ట్యూమ్స్, స్టంట్స్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో అనుభవం లేదా అధికారిక సర్టిఫికేట్ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు యూనియన్ ఫీజు పేరుతో లక్షల రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. ఇందులో ముఖ్యంగా టాలెంట్‌కు ప్రాధాన్యత ఇస్తామని, సరైన అర్హతలు ఉన్న వారెవరైనా అవకాశం పొందవచ్చని పేర్కొన్నారు.
ఈ పరిణామాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త విధానానికి, ఔత్సాహికుల అవకాశాలకు మార్గం సుగమం చేస్తున్నాయి. అభ్యర్థులు నిర్ణీత వెబ్‌సైట్ లేదా మెయిల్ ఐడీ ద్వారా తమ దరఖాస్తులు పంపించవచ్చు.