'కూలీ'కి తెలుగులో భారీ డిమాండ్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని ఆగస్టు 14న రిలీజ్కు రెడీగా ఉంది.;
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని ఆగస్టు 14న రిలీజ్కు రెడీగా ఉంది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, పూజా హెగ్డే, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణం ఉంది. ముఖ్యంగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తుండటంతో తెలుగు రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో, బయ్యర్లు భారీ ఆఫర్లు చేస్తున్నారు. నాగార్జునకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. రూ.40-45 కోట్ల మధ్య ఈ డీల్ ముగిసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రూ.36-43 కోట్ల మధ్య ఆఫర్లు వచ్చాయని, కానీ నిర్మాతలు కనీసం రూ.40 కోట్లు (జీఎస్టీ మినహాయించి) ఆశిస్తున్నారని టాక్.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మల్టీ స్టారర్ పై నాలుగు భాషల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అదే రోజున ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందుతున్న 'వార్ 2' కూడా విడుదల కాబోతుండటంతో 'కూలీ' రైట్స్ విషయంలో కొంత రిస్క్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయినా లోకేష్ గత చిత్రాలు ‘విక్రమ్, లియో’ తెలుగులో మంచి లాభాలు అందించడంతో 'కూలీ' కోసం క్రేజీ భారీగానే ఉంది.