బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'హిట్ 3'

వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 'హిట్ 3' మాస్ ర్యాంపేజ్ కొనసాగుతుంది. యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.;

By :  S D R
Update: 2025-05-02 02:12 GMT

వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 'హిట్ 3' మాస్ ర్యాంపేజ్ కొనసాగుతుంది. యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సెన్సేషనల్ వసూళ్లు నమోదు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో ఈ చిత్రం విడుదల రోజే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఇది నాని సినిమాల్లో అరుదైన ఘనత.

ఫస్ట్ డే నెట్ కలెక్షన్ పరంగా ఇండియాలో ఈ చిత్రం రూ.18.18 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇది నాని కెరీర్‌లో 'దసరా' తర్వాత మరో అరుదైన ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఆంధ్రా, తెలంగాణ, ఇతర రాష్ట్రాల కలెక్షన్లు మంచి స్థాయిలో ఉండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో ఇంకా మంచి ఆదరణ లభిస్తుంది.

కథ విషయానికి వస్తే, నాని పోషించిన అర్జున్ సర్కార్ పాత్ర దేశవ్యాప్తంగా జరుగుతున్న సీరియల్ కిల్లింగ్ కేసులను ఛేదించేందుకు రంగంలోకి దిగుతుంది. కథలో సీరియల్ కిల్లర్ కంటే భయంకరమైన నిజాలు బయటపడతాయి. ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో నాని యాక్షన్ స్కిల్ల్స్, ఇంటెన్సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా 'హిట్ 3' ఒక యాక్షన్‌ కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా, నాని కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమవ్వబోతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

Tags:    

Similar News