‘హిట్ 3‘ బాక్సాఫీస్ దూకుడు

నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’ విడుదలైన మొదటి రోజునుండే భారీ హైప్‌తో బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది.;

By :  S D R
Update: 2025-05-03 07:19 GMT

నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’ విడుదలైన మొదటి రోజునుండే భారీ హైప్‌తో బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూడో భాగం, ‘హిట్’ ఫ్రాంచైజీలోనే అత్యధిక వసూళ్లతో దూసుకెళ్తుంది.

నాని డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.43 కోట్లు కొల్లగొట్టింది. రెండు రోజులకు వరల్డ్ వైడ్ గా రూ.62 కోట్లు వసూళ్లను సాధించింది. మరోవైపు ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లను అందుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రచారం కోసం అమెరికాలో సందడి చేస్తున్నారు హీరోహీరోయిన్లు నాని, శ్రీనిధి శెట్టి. ఈ సినిమాలో నాని, శ్రీనిధి కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌ను చేరనున్న ఈ చిత్రం, నాని కెరీర్‌లో మరో మైలురాయిగా గుర్తింపు పొందబోతుంది.



Tags:    

Similar News