'హిట్ 3' బాక్సాఫీస్ మాయాజాలం
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.;
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్ సాధించి, నాని కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్‌తో రికార్డు సృష్టించింది.
‘హిట్’ ఫ్రాంచైజ్‌లో మూడో చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే హాట్-హెడెడ్, రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. జమ్మూ కాశ్మీర్‌లో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌లో పనిచేసే అర్జున్, దేశవ్యాప్తంగా జరిగిన కిరాతక హత్యల కేసును ఛేదించే ప్రయత్నంలో ఉత్కంఠభరితమైన ప్రదర్శన ఇచ్చాడు.
దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రంలో నాని క్యారెక్టరైజేషన్‌ను గ్రాండ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, యూత్‌ను ఆకట్టుకునే డైలాగ్‌లతో సినిమాను ఆకర్షణీయంగా మలిచాడు. నాని అద్భుతమైన నటన, బలమైన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు బాక్సాఫీస్ విజయాన్ని తెచ్చిపెట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నాన్‌థియేట్రికల్ రూపంలో 80 శాతం రికవరీ సాధించిన 'హిట్ 3'.. ఈ వీకెండ్ వరకే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.