‘ఘాటి’ మరోసారి వాయిదా!

అందాలతార అనుష్క శెట్టి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఘాటి’ విడుదల మళ్లీ వాయిదా పడింది.;

By :  S D R
Update: 2025-07-05 11:27 GMT

అందాలతార అనుష్క శెట్టి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఘాటి’ విడుదల మళ్లీ వాయిదా పడింది.జులై 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ, తాజాగా విడుదల వాయిదా పడినట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా టీమ్ ఒక ఎమోషనల్ నోట్‌ రిలీజ్ చేసింది. ‘సినిమా ఒక జీవనది లాంటిది. ‘ఘాటి’ కేవలం సినిమా కాదు.. ప్రకృతిలో పుట్టిన ప్రతిధ్వని. ప్రతి ఫ్రేమ్‌ అద్భుతంగా ఉండాలనే లక్ష్యంతో సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం‘ అని ఈ నోట్ లో తెలిపింది.

మొత్తంగా.. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ పూర్తి కాలేదన్న కారణంతోనే ‘ఘాటి‘ వాయిదా పడినట్టు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘వేదం’ తర్వాత అనుష్క-క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.



Tags:    

Similar News