'హిట్ 3'కి దుల్కర్ బూస్ట్!

'హిట్ 3' కోసం నేచురల్ స్టార్ నాని నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం, ట్రైలర్ విడుదల తర్వాత భారీ బజ్‌ను సృష్టించింది.;

By :  S D R
Update: 2025-04-17 00:45 GMT

'హిట్ 3' కోసం నేచురల్ స్టార్ నాని నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం, ట్రైలర్ విడుదల తర్వాత భారీ బజ్‌ను సృష్టించింది. ముఖ్యంగా నానిలో మనం ఎప్పుడూ చూడని ఒక వైలెంట్ మాస్ మేకోవర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. సీరియస్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా నాని.. నెత్తిన రక్తంతో, గడ్డిగా అరిచే యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకుల్లో మాస్ ఫీవర్ పెంచాడు.

'హిట్ 3' ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదని, చిన్న పిల్లలు చూడకూడదని నాని ముందుగానే చెప్పేశాడు. కథ డిమాండ్ మేరకు వైలెన్స్ తప్పనిసరి అని చెప్పాడు. శైలేష్ కొలను 'హిట్' సిరీస్ లో భాగంగా ఈ మూవీ మే 1న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమైంది.

మలయాళంలో ప్రముఖ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత బ్యానర్ వెఫారర్ ఫిలింస్ ద్వారా ఈ సినిమాను విడుదల చేస్తుండడం విశేషం. దుల్కర్ రిలీజ్ చేస్తుండడంతో మలయాళంలో 'హిట్ 3'పై క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తం సుమారు రూ.40 కోట్లుకి అమ్ముడయ్యాయని టాక్. ముఖ్యంగా నైజాం, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఓటీటీ హక్కులు రూ.54 కోట్లు, ఆడియో రైట్స్ రూ.6 కోట్లు. మొత్తం కలిపితే 'హిట్ 3' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.100 కోట్లకు పైగా దాటేసిందనేది ట్రేడ్ టాక్. 'హిట్ 1, హిట్ 2' విజయాల తర్వాత ఈ హిట్ ఫ్రాంచైజీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

Tags:    

Similar News