‘వీరమల్లు‘కి డివోషనల్ టచ్

గడిచిన కొన్ని సంత్సరాలుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డివోషనల్ మూవీస్ కి మంచి ఆదరణ దక్కుతుంది. దైవత్వం నిండిన కథాంశాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.;

By :  S D R
Update: 2025-07-09 06:34 GMT

గడిచిన కొన్ని సంత్సరాలుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డివోషనల్ మూవీస్ కి మంచి ఆదరణ దక్కుతుంది. దైవత్వం నిండిన కథాంశాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ లిస్టులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘ కూడా చేరబోతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్.

పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో ఫిక్షనల్ స్టోరీగా రూపొందించారు. అయితే.. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాలో హిందుత్వం గురించి గట్టిగానే చెప్పబోతున్నట్టు అర్థమయ్యింది.

హిందుత్వానికి తోడు ‘వీరమల్లు‘లో దైవత్వం కూడా ఉందని చెబుతున్నారు మేకర్స్. ఈ సినిమాలోని వీరమల్లు పాత్రను శైవం, వైష్ణవం మేళవింపుగా రూపొందించారట. సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో ఓ ధర్మయోధుడి ప్రయాణాన్ని ఈ సినిమా చాటుతోందని చెబుతుంది టీమ్.

అయ్యప్ప స్వామి శైవ-వైష్ణవ సంప్రదాయాల కలయికగా పిలవబడినట్టే, వీరమల్లు పాత్రను కూడా శివుడు,. విష్ణువుల అవతారంగా చిత్రీకరించారట. ఈ సినిమాలో డేగ, డమరుకం వంటి సంకేతాల ద్వారా ఈ అంశాన్ని బలంగా చాటినట్టు చెబుతున్నారు. తొలుత క్రిష్ రూపొందించిన కథను దర్శకుడు జ్యోతికృష్ణ తీసుకుని, మూల తత్వాన్ని నిలుపుకుంటూనే సరికొత్త పంథాలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడట.

ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీని మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ సమకూర్చారు. ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ట్రైలర్‌తో పెరిగిన అంచనాల మధ్య, ఈ సినిమాకు పంపిణీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకే ఓవర్సీస్, హిందీ తప్ప మిగతా ఏరియాల రైట్స్ ఎ.ఎమ్.రత్నం అమ్మలేదు. మొత్తంగా.. విడుదల తర్వాత ‘వీరమల్లు‘ ఎలాంటి కలెక్షన్ల రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

Tags:    

Similar News