'కూలీ' ప్రమోషనల్ స్ట్రాటజీ!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాపై కేవలం తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ క్రేజుంది.;
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాపై కేవలం తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ క్రేజుంది. అందుకు ప్రధాన కారణం రజనీకాంత్ తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ క్యాస్టింగ్ నటించడం. లేటెస్ట్‌గా ఈ మూవీ నుంచి పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ 'మోనిక' ప్రోమో వచ్చింది. అనిరుధ్ మ్యూజిక్, పూజా హెగ్డే డ్యాన్స్ ఈ పాటలో ఆకట్టుకుంటున్నాయి. ఫుల్ సాంగ్ జూలై 11న రానుంది.
అయితే, ఈ సినిమా ప్రమోషనల్ స్ట్రాటజీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సినిమాకు టీజర్ లేదా ట్రైలర్ లేకుండా నేరుగా విడుదల చేయాలన్న సన్ పిక్చర్స్ నిర్ణయం చర్చనీయాంశమైంది. బిజినెస్ ఇప్పటికే దాదాపు పూర్తయ్యిందన్న కారణంతో ఈ డేర్ ఎటెంప్ట్ చేపడుతున్నారు. కానీ, అభిమానులు మాత్రం ఈ నిర్ణయంతో కొంత నిరాశకు గురవుతున్నారు. జూలై చివరిలో చెన్నై నెహ్రు స్టేడియంలో, ఆగస్ట్ 7న హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్లు జరగనున్నాయి. ఇవే ఈ సినిమా ప్రమోషన్‌కు ప్రధాన వేదికలవుతాయని తెలుస్తోంది.
ట్రైలర్ సినిమా పబ్లిసిటీకి కీలకం అయినప్పటికీ, 'కూలీ' ఇప్పటికే అంచనాల్ని అందుకున్న సినిమా. రజనీకాంత్ స్థాయిలో ఈ విధమైన ప్రయోగం కొత్తదే అయినప్పటికీ, ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్‌లో ట్రెండ్‌గా మారే అవకాశం ఉంది. ఇక ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.