‘కూలీ‘ ప్రీ రిలీజ్ హైలైట్స్

సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మల్టీ లాంగ్వేజ్ మూవీ ‘కూలీ’. ఆగస్టు 14న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.;

By :  S D R
Update: 2025-08-04 10:44 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మల్టీ లాంగ్వేజ్ మూవీ ‘కూలీ’. ఆగస్టు 14న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది టీమ్. ఈ వేడుకకు రజనీకాంత్ హాజరు కాకపోయినా, తెలుగు ప్రేక్షకుల కోసం ఓ స్పెషల్ వీడియో సందేశం పంపారు. అలాగే నాగార్జున, సత్యరాజ్, శ్రుతి హాసన్, లోకేష్ కనకరాజ్ ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

రజనీకాంత్ వీడియో బైట్ లో ‘లోకేష్ ను తమిళ సినీ పరిశ్రమలో రాజమౌళి లాగా పొగిడారు. ‘కూలీ కథ విన్నప్పుడు సైమన్ అనే విలన్ పాత్రలో నేను నటించాలని అనిపించింది. కానీ అది నాగార్జున చేస్తున్నారనగానే ఆశ్చర్యపోయాను‘ అన్నారు రజనీ. నాగార్జున ఫిట్‌నెస్, గ్లామర్‌పై ప్రశంసలు కురిపించిన రజినీకాంత్, ‘నాగ్ గారు బాషాలోని ఆంటోని పాత్రలా ఈ సినిమాలో విలన్‌గా అదరగొట్టారు‘ అని తెలిపారు.

‘కూలీ’లో తన పాత్ర గురించి నాగార్జున ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘సైమన్ పాత్ర విని నేను ఒకింత మార్పులు సూచించాను. లోకేష్ అవన్నీ స్వీకరించి పాత్రను మెరుగుపరిచారు. నెగెటివ్ రోల్ అయినా నా కెరీర్‌లో పాజిటివ్ అనుభూతిని ఇచ్చింది‘ అని అన్నారు.

ఈ సినిమాలో రజనీకాంత్, నాగార్జునతో పాటు శ్రుతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మల్టీస్టారర్ క్రేజుతో భారీ ఓపెనింగ్స్ దక్కించుకోనుందనే అంచనాలున్నాయి.

Tags:    

Similar News