‘వీరమల్లు‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’. జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.;

By :  S D R
Update: 2025-07-08 11:11 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’. జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ఆలస్యం, చిత్రంపై వచ్చిన వదంతుల గురించి నిర్మాత ఎ.ఎమ్. రత్నం లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

మీడియాలో ప్రచారమవుతున్నట్లు సినిమా 14 సార్లు వాయిదా పడలేదని, నిజానికి కేవలం మూడు తేదీలకు (మార్చి 28, మే 9, జూన్ 12) మాత్రమే పోస్ట్‌పోన్ చేశామని చెప్పారు. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం, కరోనా, ఎన్నికల కారణంగా షూటింగ్ ఆలస్యానికి అసలైన కారణమని తెలిపారు. బిజినెస్ లేక వాయిదా వేసినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు.

దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంపై స్పందిస్తూ, ఆయనకు మరో కమిట్మెంట్ ఉండటమే కారణమని, ఆ తరువాత పవన్ కళ్యాణ్ సూచన మేరకు తనయుడు జ్యోతికృష్ణకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు.

ఇక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను రిలీజ్ కి నాలుగు రోజుల ముందు నిర్వహించనున్నట్లు చెప్పారు. వాతావరణాన్ని బట్టి తిరుపతి లేక విజయవాడ లలో ఇండోర్లో వేడుకను ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమా పవన్ కెరీర్ లో ఓ మరపురాని చిత్రంగా నిలుస్తుందని.. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయని ఎ.ఎమ్. రత్నం ధీమాగా చెప్పారు.

Tags:    

Similar News