ఎన్టీఆర్ వద్దకు బన్నీ ప్రాజెక్ట్?

క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవ్వడం.. అనుకోని కారణాలతో అవి క్యాన్సిల్ అవ్వడం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటిదే జరగబోతుందట.;

By :  S D R
Update: 2025-06-11 10:31 GMT

క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవ్వడం.. అనుకోని కారణాలతో అవి క్యాన్సిల్ అవ్వడం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటిదే జరగబోతుందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మైథలాజికల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ‘గుంటూరు కారం‘ తర్వాత త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టాడు.

కట్ చేస్తే.. బన్నీ ఇప్పుడు అట్లీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అట్లీ చిత్రం పూర్తవ్వడానికి చాలా నెలల సమయమే పడుతుంది. దీంతో మాటల మాంత్రికుడు మనసు మార్చుకున్నాడట. అల్లు అర్జున్ తో చేయాలనుకున్న పౌరాణిక చిత్రాన్ని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడట. ఇప్పటికే అందుకు సంబంధించి చర్చలు పూర్తైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘గాడ్ ఆఫ్ వార్‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు.. హారిక అండ్ హాసిని ఈ సినిమాని నిర్మించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా ట్విట్టర్ లో నిర్మాత నాగవంశీ ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

గతంలో కొరటాల శివ విషయంలోనూ ఇదే జరిగింది. అల్లు అర్జున్ తో కొరటాల ఆద్యంతం సముద్రం నేపథ్యంలో ఒక సినిమా చేద్దామనుకున్నాడు. సినిమా సెట్స్ పైకి వెళుతుంది అనుకునే లోపే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ స్థానంలోనే.. అదే సబ్జెక్ట్ తో ఎన్టీఆర్ తో ‘దేవర‘ తెరకెక్కించాడు కొరటాల.

మరోవైపు అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ సినిమా స్థానంలో ప్రశాంత్ నీల్ తో మూవీని సెట్ చేసినట్టు తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వద్ద ప్రశాంత్ నీల్ డేట్స్ ఉన్నాయి. అట్లీ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తోనే బన్నీ సినిమా ఉంటుందనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.



Tags:    

Similar News