బాలయ్య బర్త్‌డే ఫీవర్ స్టార్ట్!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) దగ్గరపడుతున్న వేళ, అభిమానుల ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ బర్త్ డే స్పెషల్ గా బాలయ్య సూపర్ హిట్ మూవీ ‘లక్ష్మీ నరసింహ’ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది.;

By :  S D R
Update: 2025-06-03 02:29 GMT

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) దగ్గరపడుతున్న వేళ, అభిమానుల ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ బర్త్ డే స్పెషల్ గా బాలయ్య సూపర్ హిట్ మూవీ ‘లక్ష్మీ నరసింహ’ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 7న ఈ సినిమా రీ-రిలీజ్ అవుతోంది.

జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2004లో సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. తమిళ బ్లాక్‌బస్టర్ ‘సామి’కు ఇది తెలుగు రీమేక్. బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్ (ఏసీపీ లక్ష్మీ నరసింహ)లో అదరగొట్టాడు. ముఖ్యంగా బాలయ్య డైలాగులకు థియేటర్లలో విజిల్ మోతే మోగింది.

ఈ చిత్రాన్ని నైజాం (తెలంగాణ), ఉత్తరాంధ్రలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ రీ-రిలీజ్ చేస్తోంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్ణాటకలలో ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తుంది. ఓవర్సీస్ లో ప్రత్యంగిరా రిలీజ్ చేస్తుంది. ఇక రీసెంట్‌గా పాత హిట్లను రీ-రిలీజ్ చేయడం ద్వారా భారీ వసూళ్లు వస్తున్న సందర్భంలో ‘లక్ష్మీ నరసింహ’ కూడా రికార్డులు నమోదు చేసే అవకాశం ఉంది.

ఇక బాలయ్య ప్రస్తుత సినిమాల విషయానికొస్తే, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ షూటింగ్ జరుగుతోంది. ఈ కాంబోలో ఇప్పటికే 'సింహా, లెజెండ్, అఖండ' లాంటి బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. జూన్ 10న బాలయ్య బర్త్‌డే స్పెషల్‌గా ఈ మూవీ టీజర్ రాబోతుందన్న ప్రచారం అభిమానుల్లో హైప్ పెంచుతోంది.

Tags:    

Similar News