అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం
మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ, కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ (94) గారు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.;
మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ, కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ (94) గారు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో రాత్రి 1.45 గంటలకు ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
అల్లు కనకరత్నమ్మ గారి పార్థివదేహం ఉదయం 9 గంటలకు అల్లు అరవింద్ నివాసానికి తరలించనున్నారు. మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇక కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. మైసూర్‌లో షూటింగ్‌లో ఉన్న రామ్‌చరణ్ అమ్మమ్మను కడసారి చూసేందుకు బయలుదేరగా, ముంబైలో అట్లీ దర్శకత్వంలో సినిమా పనుల్లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్‌కు రానున్నారు.
అల్లు కనకరత్నమ్మ గారి మృతి వార్త తెలిసిన తర్వాత సినీ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో అరవింద్ గారి ఇంటికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. అభిమానులు కూడా ఈ వార్త తెలుసుకొని తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.