అరుదైన కాంబో అఫీషియల్!
ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియన్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రభంజనంలా మారాయి. ఒక్కో దక్షిణాది చిత్రం దేశాన్ని షేక్ చేస్తుంటే, ప్రేక్షకుల్లో ఆసక్తి కొత్త ఎత్తులకు చేరుతుంది.;
ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియన్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రభంజనంలా మారాయి. ఒక్కో దక్షిణాది చిత్రం దేశాన్ని షేక్ చేస్తుంటే, ప్రేక్షకుల్లో ఆసక్తి కొత్త ఎత్తులకు చేరుతుంది.చేస్తుంటే, ప్రేక్షకుల్లో ఆసక్తి కొత్త ఎత్తులకు చేరుతుంది. ఇప్పుడు అలాంటి ఫుల్ ఫైర్ మోడ్‌లో మరో అద్భుతమైన కాంబినేషన్ సిద్ధమవుతోంది. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబో.
'పుష్ప' సిరీస్‌తో బన్నీ దేశవ్యాప్తంగా ఓ ఫినామెనాన్‌గా మారిపోయాడు. అతని యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు, అట్లీ ‘జవాన్’తో బాక్స్ ఆఫీస్‌ను బద్దలుకొట్టాడు. షారుక్ ఖాన్‌తో చేసిన ఆ చిత్రం 1000 కోట్ల క్లబ్‌లో చేరి, అట్లీ స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.
అలాంటి అల్లు అర్జున్-అట్లీ కలిసి సినిమా చేస్తే.. ఆ కాంబినేషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు అలాంటి క్రేజీ అప్డేట్‌తోనే వచ్చేశారు బన్నీ-అట్లీ. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది.
ఈ చిత్రం అల్లు అర్జున్‌కు 22వ సినిమా, అట్లీకి 6వ సినిమాగా ఉండబోతోంది. అద్భుతమైన నిర్మాణ విలువలకు పేరుగాంచిన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. కళానిధి మారన్ ఈ ప్రాజెక్టును ఓ గ్రాండ్ విజన్‌తో నిర్మిస్తున్నారు. ఈసారి మాస్ సినిమా కాకుండా… వీరిద్దరూ ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ ఎంత కీలకమో గ్రహించిన బన్నీ, అట్లీ లాస్ ఏంజెల్స్ లోని ప్రఖ్యాత VFX స్టూడియోస్‌ను సందర్శించారు. సూపర్ హీరో గెటప్ కోసం ప్రత్యేకంగా టెస్ట్ షూట్ కూడా నిర్వహించారు. అల్లుఅర్జున్ న్యూ లుక్‌ని జస్ట్ ఓవర్ ది టాప్ అంటున్నారు ఇండస్ట్రీలో. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుంది.