హిట్ vs రెట్రో.. థియేటర్లలో రక్తపాతం!

మే 1న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బడా క్లాష్ జరగబోతుంది. నేచురల్ స్టార్ నాని 'హిట్ 3', విలక్షణ నటుడు సూర్య 'రెట్రో' సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తున్నాయి.;

By :  S D R
Update: 2025-04-19 03:42 GMT

మే 1న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బడా క్లాష్ జరగబోతుంది. నేచురల్ స్టార్ నాని 'హిట్ 3', విలక్షణ నటుడు సూర్య 'రెట్రో' సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తున్నాయి. రెండు సినిమాలూ వైలెన్స్ ప్రధానంగా రాబోతున్నవే.

సూపర్ 'హిట్' సిరీస్ లో థర్డ్ కేస్‌గా రాబోతుంది 'హిట్ 3'. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాని పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే.. ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో 'ఎ' సర్టిఫికెట్ దక్కింది.

ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలు. ఫస్టాఫ్ 1 గంట 14 నిమిషాలు కాగా.. సెకండాఫ్ 1 గంట 20 నిమిషాలు ఉండబోతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో ప్లాన్ చేసింది టీమ్. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది.

మరోవైపు గ్యాంగ్‌స్టర్ డ్రామాలు తీర్చిదిద్దడంలో మాస్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ 'రెట్రో'ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్ డ్రామాతో పాటు సూర్య, పూజా హెగ్డే మధ్య రొమాన్స్ ను హైలైట్ చేశాడు. ముఖ్యంగా.. రెట్రో లుక్ లో సూర్య సమ్‌థింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాడు. తెలుగులోనూ సూర్యకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో 'హిట్ 3'కి 'రెట్రో' గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News