డిసెంబర్ లోనే 'అఖండ.. తాండవం'?
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మోస్ట్ అవైటింగ్ మూవీ 'అఖండ 2'. ఈ ఏడాది సంక్రాంతి బరిలో 'డాకు మహారాజ్'తో ఘన విజయాన్ని అందుకున్న బాలయ్య.. దసరా కానుకగా 'అఖండ 2'ని రిలీజ్ చేద్దామనుకున్నాడు.;
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మోస్ట్ అవైటింగ్ మూవీ 'అఖండ 2'. ఈ ఏడాది సంక్రాంతి బరిలో 'డాకు మహారాజ్'తో ఘన విజయాన్ని అందుకున్న బాలయ్య.. దసరా కానుకగా 'అఖండ 2'ని రిలీజ్ చేద్దామనుకున్నాడు. అయితే.. లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ మూవీ దసరా స్లాట్ నుంచి తప్పుకుందట.
ఇప్పటివరకు సెప్టెంబర్ 25న దసరా స్పెషల్ గా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్న మేకర్స్, తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 18న సినిమాను విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తయారవుతోన్న ఈ మూవీలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువగా పెండింగ్ ఉందట.
అలాగే సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసి, అన్ని భాషల్లో భారీగా రిలీజ్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే డిసెంబర్ పై ఫోకస్ పెట్టారట మేకర్స్. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రిలీజ్ అవుతుండగా, ఆ తర్వాత రెండు వారాలకు 'అఖండ 2'ని తీసుకురావాలనే ఆలోచనలో ఉందట టీమ్.
బాలకృష్ణ, బోయపాటి సూపర్ డూపర్ హిట్ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో 'అఖండ 2' డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ జయంట్స్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియో హాట్‌స్టార్ మద్య తీవ్రమైన పోటీ నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. బలమైన డివోషనల్ కంటెంట్ తో రాబోతున్న ఈ సినిమాని దక్కించుకునేందుకు ఈ ఓటీటీ సంస్థలు తీవ్రంగా పోటీ పడుతున్నాయట.