‘అఖండ 2’లో ఆది పినిశెట్టి – క్లారిటీ వచ్చేసింది!

Update: 2025-02-22 04:50 GMT

‘అఖండ 2’లో ఆది పినిశెట్టి – క్లారిటీ వచ్చేసింది!

నటసింహం బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ 'అఖండ'కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ 2: తాండవం'. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా సర్క్యులేట్ అవుతుంది. లేటెస్ట్ గా దీనిపై క్లారిటీ దొరికేసింది.

తాను 'అఖండ 2'లో భాగమైనట్టు కన్ఫమ్ చేశాడు ఆది పినిశెట్టి. అంతేకాదు తనకు సంబంధించి ఓ షెడ్యూల్ కూడా పూర్తైనట్టు తెలిపాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' చిత్రంలో నటించాడు ఆది. 'సరైనోడు'లో విలన్ గా ఆది పినిశెట్టికి మంచి పేరొచ్చింది. ఇప్పుడు 'అఖండ 2'లోనూ ఆది రోల్ ఎంతో పవర్‌ఫుల్ గా ఉండబోతుందట.

ఈ సినిమాలో సంయుక్త, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తుండగా, బాలకృష్ణ కుమార్తె ఎం. తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 'అఖండ 2' సినిమాను 2025 సెప్టెంబర్ 25న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

Tags:    

Similar News